Header Banner

రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. మా విజయంలో 'సైలెంట్' హీరో అతడే..!

  Mon Mar 10, 2025 12:12        Sports

ఐసీసీ టోర్నీలంటే చాలు, ఆటతీరును మరో లెవల్ కు తీసుకెళ్లే టీమిండియా... తాజాగా పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లో విన్నర్ గా నిలిచింది. ఒక్కసారి కూడా టాస్ గెలవకపోయినా, టోర్నీలో అన్ని మ్యాచ్ లు గెలిచి కప్ ను చేజిక్కించుకుంది. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో తమ విజయంలో ఒక 'సైలెంట్ హీరో' ఉన్నాడని వెల్లడించాడు.  శ్రేయస్ అయ్యర్ ను తను 'సైలెంట్ హీరో'గా అభివర్ణించాడు. మిడిలార్డర్ లో శ్రేయస్ అయ్యర్ రాణించడంతో సులువుగా విజయాలు నమోదు చేయగలిగామని వివరించారు. "ఈ టీమ్ పట్ల నేనెంతో గర్విస్తున్నాను. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించకపోవచ్చని మాకు తెలుసు... అందుకు అనుగుణంగా మమ్మల్ని మేం తీర్చిదిద్దుకున్నాం. ఈ టోర్నీలో మేం ఆడిన అన్ని మ్యాచ్ లు చూస్తే... పిచ్ లు  మందకొడిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరు అద్భుతం. టోర్నమెంట్ మొత్తం అతడు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇతరులతో కలిసి అతడు నమోదు చేసిన భాగస్వామ్యాలు ఎంతో విలువైనవి. అందుకే శ్రేయస్ అయ్యర్ మా సైలెంట్ హీరో" అని రోహిత్ శర్మ వివరించాడు. శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో పాకిస్థాన్ పై 56, న్యూజిలాండ్ పై 79 పరుగులతో రాణించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 45 పరుగులు చేసిన ఈ ముంబయి వాలా... ఫైనల్లో 48 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #Indiateam #Cricket #NewZealand